గజ్వేల్ ఆధ్యాత్మిక వేత్తకు జాతీయ ఉగాది పురస్కారం
SDPT: గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజుకు జాతీయ స్థాయి 'ఉగాది పురస్కారం' లభించడంపై ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక రంగంలో గత 30 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న రామరాజును ఆయన ఘనంగా సన్మానించారు. అవార్డు రావడం గజ్వేల్‌కే గర్వకారణమని, ప్రతి ఏటా భద్రాచలం రామయ్య కల్యాణానికి ఆయన అందిస్తున్న సేవలు కొనియాడారు.