6వ వార్డు బీజేపీ అభ్యర్థి నామినేషన్
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నికకి బీజేపీ అభ్యర్థిగా సత్యమ్మ మహాదేవ్ నామినేషన్ వేశారు. వార్డు సమస్యలను పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.