మంగళగిరిలో హిజ్రాలకు కౌన్సిలింగ్

GNTR: హిజ్రాలకు మంగళగిరి సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవల జరిగిన హత్య కేసుల్లో హిజ్రాలు నిందితులుగా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ప్రజలను ఇబ్బంది పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.