నిరుపేద మహిళలకు ఉపకరణాల పంపిణీ
VSP: యునైటెడ్ వే ముంబై సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద, బాధిత ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో నేడు 64 మంది లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. విశాఖలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో యునైటెడ్ వే ముంబై హెచ్ఆర్ హెడ్ పవిత్ర దూబే మహిళలకు కుట్టు మిషన్లు, రుబ్బు మిషన్లు, తోపుడు బళ్లు, ఇడ్లీ పాత్రలు పంపిణీచేశారు.