పులివెందులలో పర్యటించనున్న మాజీ సీఎం
KDP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. 22న లింగాల మండలం ఇప్పట్లలో వైసీపీ నేత సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు.