బీఆర్ఎస్ 'ప్రజా ఆశీర్వాద సభ'కు సర్వం సిద్ధం
జగిత్యాల పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. BRS అధినేత కేసీఆర్‌తో సహా 150 మంది ముఖ్యనేతలు కూర్చునేలా వేదిక నిర్మించారు. కేసీఆర్ సాయంత్రం 5 నుంచి 5.30 మధ్య హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి దరూర్ క్యాంపులోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ముఖ్య నాయకులతో సమావేశమైన అనంతరం సభకి వస్తారు.