ఎమ్మెల్యే పై బీజేపీ నాయకులు విమర్శలు మానుకోవాలి

ఎమ్మెల్యే పై బీజేపీ నాయకులు విమర్శలు  మానుకోవాలి

HNK: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ హితవు పలికారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శ్రీ పాల్గొన్నారు.