బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
SRD: బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయానికి కార్తీక మాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలో గంటల పాటు వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో జంటలు పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు ఆలయానికి పోటెత్తడంతో ఆలయ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది.