దేవాదుల నీటితో చెరువులు నింపాలని ధర్నా

WGL: దేవాదుల నీటితో చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భాజపా శ్రేణులు ధర్నా రాస్తారోకో చేశారు. మంగళవారం వర్ధన్నపేట మండలం కట్ర్యాల మీదిగా ఉన్న వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెరువులు, కుంటల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నేతలు తెలిపారు.