కార్మికుల సమస్యలు పరిష్కరించండి

BDK: ఇల్లందు పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నేడు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ఫర్‌ల పేరుతో మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన కోరారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారు.