అయప్ప స్వామి 12వ వార్షికోత్సవ మహోత్సవం
MDCL: AVB పురంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశాస్తా అయ్యప్ప స్వామి 12వ వార్షికోత్సవ మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి జనసేన ఇంఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలో జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.