'కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి'

'కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి'

ప్రకాశం జిల్లా ఏఐటీయూసీ 12వ మహాసభ ఆదివారం ఒంగోలులోని లింగయ్య భవనంలో జరిగింది. ఈ మహాసభలో మార్కాపురం జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యాసిన్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను పరిరక్షించడం కోసం సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.