రైతు వేదిక వద్ద రైతుల నిరసన

రైతు వేదిక వద్ద రైతుల నిరసన

MDK: తూప్రాన్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా ఎరువు కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. తూప్రాన్ పట్టణంలోని రైతు వేదిక వద్ద రైతులకు మూడు రోజులుగా యూరియా కోసం టోకెన్లు జారీ చేస్తున్నారు. శనివారం సైతం రైతులు రైతు వేదిక వద్దకు విచ్చేశారు. చెప్పులతో క్యూలైన్లు కట్టారు. టోకెన్లు జారీ చేయకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.