మధ్యప్రదేశ్‌లో చీతా కూన మృతి

మధ్యప్రదేశ్‌లో చీతా కూన మృతి

మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చీతా కూన ఒకటి మృతి చెందిది. దాదాపు 20 నెలల వయసున్న మగ చీతా కూన.. కూనో జాతీయవనం నుంచి బయటకు వచ్చి ఆగ్రా-ముంబై జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చీతా కూన అక్కడికక్కడే చనిపోయింది. చీతా ప్రాణాలు తీసిన వాహనానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.