టీ-20 వరల్డ్ కప్ జట్టులో అల్లూరి జిల్లా యువతి

టీ-20 వరల్డ్ కప్ జట్టులో అల్లూరి జిల్లా యువతి

ASR: దేశంలో తొలిసారిగా జరగనున్న మహిళల టీ-20 అంధ ప్రపంచ కప్ జట్టులో ఏపీ నుంచి పాంగి కరుణ కుమారి ఎంపికయ్యారు. అల్లూరి జిల్లాకు చెందిన కరుణ కుమారి ప్రస్తుతం విశాఖలోని ఎండాడ ప్రభుత్వ అంధుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ నవంబర్ 11 నుంచి 25 వరకు న్యూఢిల్లీ, బెంగళూరు వేదికగా జరగనుంది.