ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఆదినారాయణ రెడ్డి
AP: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కూటమి ప్రభుత్వంలో పెద్దలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పటికే డిసైడ్ అయ్యాను.. పదవి కంటే నాకు ప్రజలే ముఖ్యం. నేను అనుకున్నవి జరగకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఏం తేడా వచ్చినా ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను' అని పేర్కొన్నారు.