మల్టీలెవల్​ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. ఇద్దరు అరెస్ట్​

మల్టీలెవల్​ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. ఇద్దరు అరెస్ట్​

NZB: లక్కీ జనరల్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం సీపీ సాయిచైతన్య తెలిపారు. ఎల్జీ ఇండియా పేరుతో ఉన్న యాప్​లో పెట్టుబడి పెట్టి మోసపోయానని రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్లమధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.