మంజీరాలో మృతదేహం కలకలం

KMR: వంవందపిట్లం మండలం బొల్లక్‌పల్లి శివారులోని మంజీరాలో శనివారం ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటిపై మృతదేహం తేలియాడుతుండగా పలువురు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, జాలర్ల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డు పైకి చేర్చారు. మృత దేహాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.