జూలై 25న రాష్ట అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
NZB: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న రాజారాం స్టేడియంలో అండర్ 08,10, 12,14,18 బాల బాలికల చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల, రాజా గౌడ్ తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపుతామని అన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సెక్రటరీ రాజాగౌడ్ అన్నారు.