'అరైవ్-అలైవ్'పై షార్ట్ఫిల్మ్ పోటీలు
HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 'అరైవ్-అలైవ్' కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఓపెన్ రోడ్ సేఫ్టీ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ మేకింగ్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఆసక్తిగల ఫిల్మ్ మేకర్లు, డైరెక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, విద్యార్థులు, ప్రజలు పాల్గొనవచ్చు. ఈ నెల 31 వరకు 30-90 సెకన్ల వీడియో వ్యవధితో ఉండాలని సూచించారు.