డిసెంబర్ 5, 12న సొసైటీ ఎన్నికలు
ATP: జిల్లాలో షీప్ సొసైటీ ఎన్నికలకు పశుసంవర్ధక శాఖ చర్యలు ప్రారంభించింది. 350 సొసైటీలు రిజిస్టర్ కాగా 215 డిపార్ట్‌మెంట్ యూనియన్ పరిధిలో ఉన్నాయి. JAN–ఫిబ్రవరిలో 130 సొసైటీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న అనంతపురం 39, సత్యసాయి 45 సొసైటీలకు డిసెంబర్ 5, 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. సీడీసీ రుణ డిఫాల్టర్లు పోటీకి అనర్హులని అధికారులు తెలిపారు.