VIDEO: అర్జీలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
SRPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 47 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. అదనపు కలెక్టర్ సీతారామరావుతో కలిసి ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.