నర్సంపేట ఆర్టీసీ డిపోలో ‘యాత్రాదానం’ కార్యక్రమం ప్రారంభం

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోలో శనివారం డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ ‘యాత్రాదానం’ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలకు విహార యాత్రలు చేయవచ్చని ఆమె తెలిపారు. బస్సుల బుకింగ్ కోసం 9959226052 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.