VIDEO: అంగవైకల్యాన్ని జయించిన మాతృత్వం

VIDEO: అంగవైకల్యాన్ని జయించిన మాతృత్వం

అంగవైకల్యం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన గీతా బాయికి ఒకే చేయి ఉన్నా, పట్టుదలతో తన కుటుంబానికి అండగా నిలుస్తోంది. తన పిల్లలను సాకడం కోసం ఆమె పొలాల్లో కష్టపడుతోంది. ఒక చేతికి కొడవలిని కట్టుకుని ఎంతో చాకచక్యంగా పంటను కోస్తోంది. 'కష్టపడి సంపాదించుకోవడంలోనే నిజమైన గౌరవం ఉంది, ఉచితంగా ఏదీ వద్దు' అని ఆమె చెప్పిన వీడియో SMలో వైరల్ అవుతోంది.