విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణకు ప్రాధాన్యత

Vsp: విశాఖ నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్‌లో బీచ్ క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడీపీ, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ.. ఎంతో సుందరమైన విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నమన్నారు.