10 యూనిట్ల రక్తం సేకరణ
ASR: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ గంగరాజు తెలిపారు. ఈ శిబిరంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్, తహసీల్దార్ త్రివేణి, ఏటీడబ్ల్యూవో రమణ తదితర అధికారులు పాల్గొన్నారన్నారు. 10 యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు.