VIDEO: అంబటి దిష్టిబొమ్మ దహనం చేసిన టీడీపీ శ్రేణులు
CTR: సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పుంగనూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇంఛార్జ్ చల్లాబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన నిరసనలో మహిళా నేతలు అంబటి దిష్టిబొమ్మకు చీపురులతో దేహశుద్ధి చేసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.