ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం
KNR: పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ, పాకిస్థాన్తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. KNRలో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని అన్నారు.