'ఈ నెల 30లోగా పన్నులు చెల్లించండి'

'ఈ నెల 30లోగా పన్నులు చెల్లించండి'

VSP: ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదవకాశాలు కల్పించింది. 2026 మార్చి 31 వరకు ఉన్న బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5 శాతం రిబేట్ కూడా లభిస్తుందని చెప్పారు.