"జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి'

ఆదిలాబాద్: ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భీమారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిని శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ... పెద్ద పత్రికలు, చిన్న పత్రికలను తేడా లేకుండా మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకి ఇండ్లు ఇవ్వాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.