మే12న చందర్లపాడు రానున్న జబర్దస్త్ టీమ్

NTR: చందర్లపాడులో ఈనెల 12వ తేదీన జరగనున్న అలివేలమ్మ తిరుణాల మహోత్సవంలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, శాంతి స్వరూప్, కార్తీక్, తదితరులు పాల్గొననున్నారు. ఈ జాతర మహోత్సవంలో ప్రజలందరినీ కడుపుబ్బ నవ్వించేందుకు వస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రతి ఒక్కరూ ఈ జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.