జగన్ బలం తగ్గుతోంది: ఆదినారాయణ రెడ్డి
AP: కూటమి బలం క్రమంగా పెరుగుతోందని, జగన్ బలం తగ్గుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. మద్యం కేసుల్లో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని, ఇటీవల జరిగిన పులివెందుల ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన ఆరు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందని వెల్లడించారు.