తాళ్ల పొద్దుటూరు ఎస్సై సస్పెండ్
కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి SIమధుసూధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.