HIT TV వార్తపై స్పందించిన మున్సిపల్ అధికారులు
సత్యసాయి: పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదకరంగా వంగి ఉన్న చెట్టును HIT TVలో గత వారం ప్రసారమైన వార్తపై అధికారులు స్పందించి తొలగించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశమున్న చెట్టు కొమ్మలను మున్సిపల్ సిబ్బంది ఈరోజు నరికి పడేశారు. స్థానికులు వెంటనే చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.