బి.క్యాంపు పాఠశాల ఆవరణ డంప్ యార్డ్‌లా మారింది!
కర్నూలు బి. క్యాంపు ప్రభుత్వ బాయ్స్ పాఠశాల ఆవరణ మొత్తం చెత్తతో నిండి డంప్ యార్డ్‌ను తలపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇది పాఠశాలా, లేక డంపింగ్ యార్డా అంటూ, వారు ప్రశ్నించారు.