నిధుల దుర్వినియోగం.. రెండవసారి విచారణ

నిధుల దుర్వినియోగం.. రెండవసారి విచారణ

కృష్ణా: మోపిదేవిలోని ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో 'నాడు-నేడు' నిధులలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండవసారి ఉయ్యూరు డివిజన్ విద్యాశాఖ అధికారిణి పద్మారాణి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన దుర్గా సాగర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.