సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
AP: సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. 'పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం. రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పాం. ఇప్పటికే మొదటి విడతలో రైతుల అకౌంట్లో రూ.7 వేలు జమ చేశాం. ఇవాళ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ చేశాం' అని పేర్కొన్నారు.