పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
MHBD: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పలుపాఠశాల విద్యార్థులతో పాటు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సర్వయ్య, టౌన్, రూరల్, కురవి పోలీస్ స్టేషన్‌ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను వారు స్మరించుకున్నారు.