రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన
జగిత్యాలలోని జేఎస్ రాంవెల్ గాంధీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా. కృష్ణ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ దవాఖానాలోనే డెలివరీ చేయించుకోవాలని గర్భిణీలకు సూచించారు.