పేకాట రాయుళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడి
గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట రాయుళ్లపై టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం దాడులు చేసింది. చుట్టుగుంటలోని విజయకృష్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఒక ఆఫీసులో పేకాటాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 34,310 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక టూవీలర్ స్వాధీనం చేసుకున్నట్లు బృందం తెలిపింది.