నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన
MNCL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ కాసిపేట మండల గనిపై విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొత్త కోడ్‌ల వల్ల ఉద్యోగ భద్రత కరువై, యాజమాన్యాలకే పూర్తి అధికారం లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంఘాలు కార్మిక ద్రోహానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.