మైనారిటీలను కాంగ్రెస్ వంచించింది: కేటీఆర్
TG: తెలంగాణ భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా ప్రభుత్వం వారిని మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు.