'ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాం'

అన్నమయ్య: ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మంగళవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రామారావు కాలనీ 4వ వార్డులో ఎమ్మెల్యే స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందించారు.