మద్దతు కూడగట్టుకునేందుకు నేతల ప్రయత్నాలు

మద్దతు కూడగట్టుకునేందుకు నేతల ప్రయత్నాలు

JN: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జనగామ జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. పోటీ చేసే ఆశావాహులు మద్దతు కూడగట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు మద్దతుగా నిలవాలని ముఖ్య కార్యకర్తలను, అనుచరులను కోరుతున్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.