అంతర్గత నీటిమార్గాల అభివృద్ధికి ప్రణాళిక

NTR: విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో అంతర్గత నీటిమార్గాల(ఇన్ల్యాండ్ వాటర్వేస్) అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కార్గో రవాణాను 8 మిలియన్ టన్నుల నుంచి 14 మిలియన్ టన్నుల వరకు పెంచడంతోపాటు క్రూయిజ్ మార్గాలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు.