VIDEO: 'గని పరిరక్షణకు సమరశీల పోరాటాలు చేయాలి'
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని పరిరక్షణకు కార్మికులు యూనియన్లకు అతీతంగా సమరశీల పోరాటాలు చేయాలని AITUC నాయకులు వెంకటస్వామి, దాగం మల్లేశ్ పిలునిచ్చారు. బుధవారం శాంతి గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. గనిలో గత 28 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.