ఎడ్లపాడులో వివాహిత ఆత్మహత్య

PLD: ఎడ్లపాడు మండలంలో భర్తతో మనస్పర్ధల కారణంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హృదయ రాణి (35) భర్తతో గొడవపడి, తన ఇంటర్ చదివే కొడుకుతో కలిసి విడిగా ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.