VIDEO: అయినవిల్లిలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

VIDEO: అయినవిల్లిలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

కోనసీమ: అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా బుధవారం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.