ఘనంగా చక్రస్నానం

ఘనంగా చక్రస్నానం

KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణ మూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించారు. రామయ్య పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం భక్తులను ఆకట్టుకుంది. రుత్వికులు, వేదపండితులు, అర్చకులు, అధికారులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు.