ఎమ్మెల్సీ సమక్షంలో బీజేపీలోకి చేరికలు

E.G: రాజానగరం మండలం తూర్పు గోనగూడెంకి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో శుక్రవారం బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆకర్షితులై బీజేపీలోకి చేరినట్లు వారు తెలిపారు.